కెనడా కేబినెట్‌లో ముగ్గురు ఇండియన్లకు చోటు!

canada cabinet
canada cabinet

ఒట్టావా: కెనడాలో భారతీయులకు అరుదైన గౌరవం లభించింది. భారత సంతతికి చెందిన ముగ్గురికి కెనడా ప్రభుత్వంలో చోటు దక్కింది. కేబినెట్‌ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఇద్దరు తెలుగువారుండటం విశేషం. ప్రసాద్‌ కాల్గరి-ఎడ్జ్‌మెంట్‌ నియోజకవర్గం నుంచి లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈయన యునైటెడ్‌ కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆయన చేసిన కృషికిగాను కెనడా ప్రభుత్వం కీలకమైన ఇన్‌స్ట్రాక్చర్‌ మంత్రిగా అవకాశమిచ్చారు.
లీలా అహీర్‌ ఎడ్‌మోంటన్‌- చెస్టర్‌మేర్‌ నియోజకవర్గం నుంచి కెనడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సోషల్‌ సర్వీస్‌లో ముందుండే ఆమెకు సాంస్కృతిక ,మహిళా సంక్షేమ శాఖ అప్పగించారు.
భారత సంతతికి చెందిన రాజన్‌ సాహ్ని సైతం కెనడా ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. ఆమెకు కేబినెట్‌లో కమ్యూనిటి అండ్‌ సోషల్‌ సర్వీసెస్‌ శాఖకు ఆమెకు అప్పగించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/