అమెరికాలో నకిలీ వీసాలు..భారత్‌కు చెందిన ముగ్గురి అరెస్టు

H-1B visa
H-1B visa

హైదరాబాద్‌: అమెరికాలో భారత్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలో వారిపై నకిలీ హెచ్‌1బీ వీసా కేసును నమోదు చేశారు. కిషోర్ ద‌త్త‌పురం, కుమార్ అశ్వ‌ప‌తి, సంతోష్ గిరిల‌ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ న‌కిలీ హెచ్‌1బీ వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు ప్రాసిక్యూట‌ర్ డేవిడ్ అండ‌ర్స‌న్ తెలిపారు. అయితే ఈ ముగ్గుర్నీ బెయిల్‌పై రిలీజ్ కూడా చేశారు. నానోసిమాంన్‌టిక్స్ కంపెనీ పేరుతో ముగ్గురూ ఓ క‌న్స‌ల్టెన్సీ న‌డిపించారు. వ‌ర్క‌ర్ల కోసం నకిలీ హెచ్‌1బీ వీసాల‌ను వీళ్లు జారీ చేశారు. ఉద్యోగాలు లేని వారి కోసం కూడా వీళ్లు వీసాల‌ను ఇచ్చారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/