టిడిపి నేతల మూడు ఇళ్లు ధ్వంసం

tdp
tdp

నెల్లూరు: వెంకటేశ్వరపురంలో ఉద్రిక్తత నెలకొంది. జనార్దన్ కాలనీలో టిడిపి నేత, మాజీ కార్పొరేటర్ సల్మా జహీర్‌కు చెందిన మూడు ఇళ్లను అధికారులు కూల్చి వేశారు. దీంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే భారీగా పోలీసులు మోహరించారు. సంఘటనా స్థలానికి వచ్చిన వుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని అరెస్టు చేశారు. సంఘటనను పర్యవేక్షిస్తున్న నెల్లూరు ఆర్డీవో చిన్నికృష్ణ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తదితరులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కాలనీలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు విధించారు. అయితే ఇదంతా కూడా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం సాధింపు చర్యల్లో భాగమేనని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/