తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడి

clouds
clouds

హైదరాబాద్‌: ప్రస్తుతం రాష్ట్రంలో వేడి ఉష్ణోగ్రతలు ఉండడంతో కరోనా విస్తరణ తగ్గు ముఖం పడుతుందని అందరూ భావిస్తున్నారు. కాని తాజాగా హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్న మూడు రోజులు పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ప్రాంతం నుంచి రాయలసీమ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ప్రభావం కనిపిస్తుంది. దీంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/