గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌

Cannabis arrested
Cannabis arrested

విశాఖ: గంజాయి మూలంగా ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ఉక్కుపాదం మోపాయి అయినప్పటికి గంజాయి తాలూకా మూలాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా విశాఖ నగర నడిబొడ్డున మరో గంజాయి ముఠా పట్టుబడింది. అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులు ముగ్గురు పోలీసులకు చిక్కారు. ఈ ముఠాలో ముగ్గురు యువకులు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, చదువు నెపంతో వీరు విశాఖలో అద్దెకు రూమ్‌లను తీసుకుని ఎందరో యువతీ, యువకులను ఇందులోకి లాగి వ్యాపారం చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. అయితే ఈ గ్యాంగులోని ముగ్గురు యువకులను మాత్రమే అరెస్టు చేసినట్లుగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా వారి వద్ద నుండి సుమారు 300 కిలోల గంజాయిని స్వాధీన పరుచుకున్నామని పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/