మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు తుపాన్‌ ముప్పు

ఢిల్లీ కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిక

Cyclone
Cyclone

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు తుపాన్‌ ముప్పు పొంచి ఉందని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ శనివారం విడుదల చేసిన బులిటిన్‌లో హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారి గంటకు 19 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని, వచ్చే 24 గంటల్లో దక్షిణ గుజరాత్‌ తీరాన్ని తాకవచ్చని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఈ తుపాన్‌ ప్రభావం వల్ల మహారాష్ట్ర, గుజరాత్‌ తోపాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కొంకణ్‌, గోవా, కర్నాటక, పుదుచ్చేరి, కరైకల్‌, తమిళనాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. తుపాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు కోరారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/