మూఢ నమ్మకాలతో మానవ మనుగడకు ముప్పు

అందరూ విజ్ఞానం వైపు ముందుకు నడవాలి

Threat to human survival with superstitions
Threat to human survival with superstitions

అడుగడుగునా మూఢనమ్మకాలను పారద్రోలాల్సిన వ్యవస్థే మూఢనమ్మకాలకు అంబాసిడర్‌గా మారడం దురదృష్టకరం.

మరోవైపు దేశభక్తి పేరుతో సినిమా థియేటర్‌లలో దేశభక్తి గీతాలు పాడించేలా చేయడం నిజమైన దేశభక్తి అని అరచే మతోన్మాదులూ, స్వామిజీలు ఇలా అందరూ శాస్త్రసాంకేతిక పరంగా దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారు.

విజ్ఞతతో కరోనా నుంచైనా ఇటువంటి వాళ్లు గుణపాఠం నేర్చుకోవాలి. విశ్వాసాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని ఇకనైనా ఆపాలి.

ప్రభుత్వాలు కూడా దీనికి అండగా నిలవాలి. శాస్త్ర విజ్ఞానంతోనే దేశాలు ముందుకు నడవడం సాధ్యమవుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలి. దీనికోసం నిరంతరం శాస్త్రాలను, శాస్త్రవేత్తలను శోధించాలి. రాబోయే విపత్తులను శాస్త్రీయంగా ఎదుర్కోవాలి.

నిజమైన దేశభక్తి ప్రజల, పర్యావరణ సంక్షేమంలోనే ఉంటుందని గ్రహించాలి. ఆ విధంగా అందరూ కలిసికట్టుగా విజ్ఞానంవైపు ముందుకు సాగాలి. దేశాభివృద్ధి కోసం మన రాజ్యాంగమే మనకు పవిత్ర గ్రంథమని గుర్తెరగాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. ఆ తర్వాత ప్రపంచం బాగుపడుతుంది.

ప్ర కృతికి సర్వం సమానమేనన్న సంగతి కరోనా ద్వారా నిరూపితమైనది. పేద, ధనిక, అనే అడ్డుగోడలతో నేను గొప్ప, నా కులం గొప్పది, నా మతం గొప్పది. నాదేశం గొప్పది అని విర్రవీగే వారికి కనువిప్పు కలిగించింది.

విపత్తులకు అందరూ సమానమేనని నిరూపించింది. అమెరికా లాంటి అగ్ర దేశాలు సైతం కరోనా దెబ్బకు తలవంచక తప్పలేదు. ఈ విపత్తు కొన్ని బాధ్యతలను కూడా గుర్తు చేస్తోంది. ప్రకృతి విపత్తులకు కారణం మానవ్ఞడేనన్న నగ్నసత్యాన్ని తెలిపింది. మానవ జాతి చరిత్రలో ప్రకృతి విపత్తులు రావడం ఇది కొత్త కాదు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వచ్చినట్లు చరిత్ర చెబు తోంది.

కలరా, ప్లేగు, ఫ్లూ వంటి అంటు రోగాలతో కోట్ల మంది చనిపోవడం జరిగింది. మరోవైపు భూకంపాలు, వరదలు, ఆమ్లవర్షాలు, ఇతర వాతావరణ మార్పులైన గ్లోబల్‌ వార్మింగ్‌, గ్రీన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ లాంటివి మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకృతి విపత్తులకు కారణం మానవ్ఞడేనన్నది సత్యానికి దగ్గరైన అంశం. పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమన్నది నిర్వివాదాంశం. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా నడుచుకున్నా, జీవరాసులన్నింటితో స్నేహంగా మెలగకపోయినా ఉత్పాతాలు తప్పవన్నది కరోనా ద్వారా నిరూపితమైనది.

కరోనాను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలన్నీ తలమునకలవుతున్నాయి. కరోనా అంటు వ్యాధి. కనుక ప్రపంచవ్యాప్తంగా గుళ్లు, గోపురాలు, చర్చిలు, మసీదులు మూతవేసి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కోసం మానవుడు పరుగులు తీస్తున్నాడు.

కరోనాకు వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాబులోకి వస్తుందా అని సామాన్య మానవుడు నుంచి అందరూ ఎదురు చూస్తున్నారు. వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధకార్మికులే దేవుళ్లై కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. మానవుడే దేవుడు అని నిరూపిస్తున్నారు.

కమ్యూనిస్టు దేశాలైన క్యూబా, వియత్నాం లాంటి చిన్న దేశాలు మానవత్వంతో వైద్యపరంగా అమెరికా లాంటి పెద్ద దేశాలకు సైతం సాయం అందిస్తుండడం విశేషం. మనదేశం కూడా కొన్ని రకాల మందులను ఇతర దేశాలకు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకుంది.

విపత్తుల్లో అందించే ఈ చర్యలన్నీ మతం, కులం, వర్గ బేధం లేని మానవ వాదాన్ని, శాస్త్రసాంకేతిక పరిజ్ఞ్ఞానం దిశగా మానవుడు పయనించాలనే సంకేతాన్ని సూచిస్తున్నాయి.

మానవుడు మూఢనమ్మకాలతో అభివృద్ధివైపు పయనించలేడని గుర్తు చేస్తున్నాయి.సమాజానికి కావలసింది గుళ్లు, చర్చిలు, మసీదులు కాదని, కావాల్సింది బడులు,ఆస్పత్రులు శాస్త్రపరిజ్ఞానం అని ప్రస్తుత పరిస్థితులు నొక్కి చెబుతున్నాయి.

బడులలో పిల్లలకు మూఢనమ్మకాలను పెంచే చదువ్ఞలు కాకుండా విజ్ఞానాన్ని అందించే చదువ్ఞలు, ప్రయోగాలు నేర్పించాలని సూచిస్తున్నాయి. విద్యార్థులను శాస్త్రసాంకేతిక రంగాలలో తీర్చిదిద్దాలని సూచిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు మౌలిక వసతులను సమకూర్చుకొని పరిస్థితులను చక్కబెట్టుకుంటు న్నాయి. భారత్‌ లాంటి దేశాల్లో మౌతిక వసతుల్లేని స్థితి.

కరోనా విజృంభిస్తే అందరికీ వైద్యం అందించలేని స్థితి. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ప్రభుత్వాల భాగస్వామ్యం తగ్గిన నేపథ్యంలో ప్రైవేట్‌ ఫార్మా కంపెనీలే ఇందులో ముందు ఉండడం శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంలో ప్రభుత్వాల వెనుక బాటును, నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. విపత్కర పరిస్థితుల అనుభవాలు ఎప్పుడూ మనిషి విజ్ఞానంవైపు పయనించాలని నొక్కి చెబుతున్నాయి.

విశ్వంలో మనిషికున్న జ్ఞానం, అవకాశాలు ఏ జీవరాశికి లేవ్ఞ. మేకను మనం అటవీ శత్రువ్ఞగా ఎలా భావిస్తామో ప్రకృతికి మనిషేనన్నది అంతే నిజం. ఎన్నో విధాలుగా మానవుడు ప్రకృతికి హాని తలపెడుతున్నాడు. విశ్వం ఆవిర్భావం ఎంతో సమత్యులతతో ఏర్పడిందో ఆ సమత్యులతను కాపాడుకోవడం మనిషి బాధ్యత అని గుర్తించుకోవడం ముఖ్యం.

ఏ దేవుడో ఈ విపత్తుల నుంచి బయటపడవేస్తాడనుకోవడం మూర్ఖత్వం. తన బాధ్యతలేని తనానికి నిదర్శనం.

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాలను పెంపొందించుకోవడం, హేతుబద్ధంగా మానవ వాదంతో ఆలోచించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుని బాధ్యతను పరిస్థితులు మరోసారి గుర్తు చేస్తున్నవి. భారత్‌ లాంటి మత మౌఢ్యంలో నిద్రపోతున్న దేశాల్లో ఇలాంటి వాస్తవాలను గుర్తించడానికి ఇంకా సమయం పడుతుందన్నది సుస్పష్టం.

మానవ జాతి చరిత్రలోనే ప్రప్రథమంగా ఎన్నో ఉపయుక్తమైన వైజ్ఞ్ఞానిక, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి చట్టాలను (ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 48ఎ, ఆర్టికల్‌ 51ఎ(జి), ఆర్టికల్‌ 51 ఎ(హెచ్‌) మన రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితో పొందుపరిచినప్పటికీ మనం వాటిని పెడచెవిన పెట్టి మళ్లీ విశ్వాసాల పేరుతో మూఢ నమ్మకాలను ప్రోత్సహించేవైపే పరిగెడుతున్నాం.

ప్రకృతి వైప రీత్యాలను శాస్త్రీయంగా అంచనా వేయలేకపోతున్నాం. దీనికి చదువుకున్నవారు, సివిల్‌ సర్వీస్‌ అధికారులు, రాజకీయ నాయకులు సైతం అతీతులు కారు.

జ్ఞానాన్ని అందించే సరైన విద్యావ్యవస్థ కూడా మనదేశంలో ప్రస్తుతం లేకపోవడం దీనికొక కారణం. సింధూ నాగరికత కాలంలోనే తక్షశిల లాంటి ప్రపంచ స్థాయి వైజ్ఞానిక విశ్వవిద్యాలయాలను నడిపిన మనదేశం ఆ తర్వాత మత ఛాందస వాదుల చేతిలో చిక్కి విజ్ఞానరహిత మైంది.

నాగరికతకు కూడా దూరం అయింది. అందుకే ఇప్పుడు పిజీలు, పిహెచ్‌డిలు చేసినవారు, ఐఎఎస్‌లు సైతం జ్యోతిష్యాల ను నమ్మడం,రంగురాళ్లను ధరించడం, నల్లదారాలుకట్టుకోవడం, రాజ్యాంగ బద్ధంగా తీర్పులు చెప్పాల్సిన న్యాయ మూర్తులు విశ్వాసాల పేరుతో మతవిశ్వాసాలకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడం చూస్తున్నాం.

శాటిలైట్లను ప్రయోగించే శాస్త్రవేత్తలు దేవ్ఞళ్లకు దండం పెట్టుకొని ప్రయోగించడం, ప్రభు త్వాలే అధికారికంగా దేవాలయాలను నడపడం,పండుగలకు, జాతరలకు దేవుళ్లకు, దేవతలకు ప్రభుత్వపరంగా పట్టువస్త్రాలు సమర్పించ డం సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి.

జ్యోతిష్యం, భూత వైద్యంలో కోర్సులను పెట్టేస్థితికి మన యూనివర్శిటీలు దిగజారడం మన రాజకీయ వ్యవస్థ వైజ్ఞానానికంగా ఎంత దిగజారిందో అర్థమవుతుంది.

విశ్వాసాలను గౌరవించాల్సిందే కానీ అవి పరి మితస్థాయిని దాటుతున్నాయి. ఇలా అడుగడుగునా మూఢనమ్మ కాలను పారద్రోలాల్సిన వ్యవస్థే మూఢనమ్మకాలకు అంబాసిడర్‌ గా మారడం దురదృష్టకరం.

మరోవైపు దేశభక్తి పేరుతో సినిమా థియేటర్‌లలో దేశభక్తి గీతాలు పాడించేలా చేయడం నిజమైన దేశభక్తి అని అరచే మతోన్మాదులూ, స్వామిజీలు ఇలా అందరూ శాస్త్రసాంకేతిక పరంగా దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నారు.

విజ్ఞ్ఞతతో కరోనా నుంచైనా ఇటువంటి వాళ్లు గుణపాఠం నేర్చుకోవాలి. విశ్వాసాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని ఇకనైనా ఆపాలి. ప్రభుత్వాలు కూడా దీనికి అండగా నిలవాలి.

శాస్త్ర విజ్ఞానంతోనే దేశాలు ముందుకు నడవడం సాధ్యమవుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలి. దీనికోసం నిరంతరం శాస్త్రాలను, శాస్త్ర వేత్తలను శోధించాలి.రాబోయే విపత్తులను శాస్త్రీయంగా ఎదుర్కోవాలి.

నిజమైన దేశభక్తి ప్రజల, పర్యావరణ సంక్షేమంలోనే ఉం టుందని గ్రహించాలి. ఆ విధంగా అందరూ కలిసికట్టుగా విజ్ఞ్ఞానంవైపు ముందుకు సాగాలి.

దేశాభివృద్ధి కోసం మనరాజ్యాంగమే మనకు పవిత్ర గ్రంథమని గుర్తెరగాలి. అప్పుడే దేశం బాగు పడుతుంది. ఆ తర్వాత ప్రపంచం బాగుపడుతుంది.

  • పూజారి రవీంద్ర

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/