మరింత విస్తరించనున్న సీఎస్‌ఎస్‌

css-corp
css-corp

అమెరికా: అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థ సీఎస్‌ఎస్‌ కార్ప్‌ విస్తరణ బాటపట్టింది. హైదరాబాద్‌తో పాటు నోయిడా, బెంగళూరు, చెన్నైలలో ఏర్పాటు చేసిన కార్యాలయాలను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సెంటర్లలో 4,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది కాలంలో ఈ సంఖ్యను 5,500కి పెంచుకోనున్నట్లు కంపెనీ సీఈవో మనీష్‌ టండన్‌ తెలిపారు. ప్రస్తుతం సంస్థ అనలటిక్స్‌, ఆటోమేషన్‌, క్లౌడ్‌ కన్సల్టింగ్‌ సర్వీసుల అందిస్తున్న సంస్థ.. ప్రతియేటా 25 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, దీంతో వ్యాపారాన్ని ఇతర రంగాలకు విస్తరించాలనే ఉద్దేశంతో మరో వెయ్యి మందిని తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు. వీరిలో నోయిడా యూనిట్‌లో పనిచేస్తున్న వంద మందిని రెండింతలు పెంచుకోనుండగా, మిగతవారిని హైదరాబాద్‌, బెంగళూరు యూనిట్‌లో తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయంగా 7 వేల మంది సిబ్బందిని కలిగివున్న సంస్థకు అమెరికాతో పాటు పోలాండ్‌, మారిషస్‌, కోస్టా రికా, చైనా, ఫిలిప్పీన్స్‌లో సెంటర్లు ఉన్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/