హాంకాంగ్‌లో వీధులపై గోడల నిర్మాణం

hong kong
hong kong

హాంకాంగ్‌: హాంకాంగ్‌లో అంతర్యుద్ధం మొదలైంది, చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ… అక్కడ కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. కాగా వాటి తీవ్రత ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తాజాగా హాంకాంగ్‌లో యూనివర్శిటీల విద్యార్థులు చేతులు కలిపారు. అందరూ ఒకే మాటపైకి వచ్చి… చైనాకు వ్యతిరేకంగా రోడ్లపై అడ్డదిడ్డంగా గోడలు నిర్మిస్తున్నారు. స్వయంగా తయారుచేసిన ఇటుకల్ని ఇందుకోసం వాడుతున్నారు. అంతేకాదు పెట్రోల్ బాంబులు, మేకులు, గుండు సూదులు ఇలా ఏవేవో తీసుకొచ్చి రోడ్లపై ఉంచుతున్నారు. కనీసం ఇలా చేస్తేనైనా చైనా తీరు మారుతుందని వాళ్లు భావిస్తున్నారు. కాగా కొన్నేళ్లుగా చైనా హాంకాంగ్‌పై పెత్తనం చెలాయిస్తోంది. ఆ దేశ నేతల్ని ఎన్నుకునే హక్కు కూడా స్థానికులకు లేకుండా చేస్తోందని ఆ దేశస్తులు వాపోతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/