మునిగిపోయిన ఇండోనేషియా ప్రెసిడెంట్‌ ప్యాలెస్‌

రెండు రోజులుగా భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Floods in Indonesia
Floods in Indonesia

ఇండోనేషియా: సోమవారం రాత్రి నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వానలతో ఇండోనేషియాలో చాలా నదులు పొంగిపొర్లుతున్నాయని, దీంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆ దేశ రాజధాని పట్టణం జకర్తా మునిగిపోయింది. రోడ్లపై ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రెసిడెంట్‌ ప్యాలెస్‌లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు మోటార్లు పెట్టి నీటిని తోడి బయటికి పోశారు. చాలా ప్రాంతాల్లో రవాణా ఎక్కడిదక్కడ నిలిచిపోయింది. లక్షల మంది జనం వరద నీటిలో చిక్కుకుని తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/