పాప కోసం ఓ తల్లి విన్నూత ఉపాయం

Mother packs 200 goodie bags
Mother packs 200 goodie bags

సియోల్‌: సౌత్ కొరియా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు విమానంలో వెళ్లిన ఓ యువతి తన నాలుగు నెలల పాప వల్ల మిగతా వారికి ఇబ్బంది కలుగుతుందేమోనని ఊహించి, పరిష్కారంగా ఆమె వినూత్న ఉపాయంతో విమానం ఎక్కింది. విమానం ఎక్కిన వెంటనే ఆ యువతి విమానంలోని ప్యాసెంజర్లందరికీ ఒక్కో ప్యాకెట్ పంచింది. ఆ ప్యాకెట్‌లో క్యాండీస్, ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి. వాటితోపాటు ప్యాకెట్‌పైన ఓ స్టిక్కర్ అతికించింది. ఆ స్టిక్కర్లో ఏముందంటే.. నా పేరు జున్వూ.. నా వయసు నాలుగు నెలలు. నేను మొదటిసారి మా అమ్మ, అమ్మమ్మతో కలిసి అమెరికాలో ఉన్న ఆంటీ దగ్గరకు వెళ్తున్నాను. నేను విమానం ఎక్కడం ఇదే మొదటిసారి. విమానంలో నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని మా అమ్మ మీకోసం ఓ బ్యాగ్ తయారుచేసింది. అందులో క్యాండీస్, ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి. నేను ఏడవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను.. కానీ ఒకవేళ ఏడిస్తే అమ్మ ఇచ్చిన క్యాండీస్ తింటూ నన్ను క్షమించండి. అని ఉంది. ఆ బ్యాగు తీసుకుని ఆ స్టిక్కర్ చదివిన వారంతా ఒక్కసారిగా పాపను దగ్గరకు తీసుకుని ముద్దాడటం మొదలుపెట్టారు. పాప ఏడవటం సహజమని.. అది అందరూ అర్థం చేసుకుంటారని ప్యాసెంజర్లు అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/