ఆ రెండు జిల్లాలు సేఫ్‌జోన్‌లో ఉన్నాయి.!

corona virus
corona virus

అమరావతి: రాష్ట్రంలో కరోనా విలయంతాండవం సృష్టిస్తున్నప్పటికి, రెండు జిల్లాలు మాత్రం సేఫ్‌ జోన్‌లో ఉన్నాయి. రాష్ట్రంలొ ఇప్పటి వరకు అన్ని జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదు అయినప్పటికి, ఇంకా ఆ రెండు జిల్లాలలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అవి విజయనగరం, శ్రీకాకుళం. జిల్లాల వారిగా చూస్తే నెల్లూరులో 32, కృష్ణా జిల్లాలో 27, కడప జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 23, ప్రకాశం జిల్లాలో 18, విశాఖ జిల్లాలో15, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, తూర్పు గోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 2 కేసులు నమోదు అయ్యాయి. కాని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కోంటున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/