ఇది శాంపిల్‌ మాత్రమే జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌

satyapal malik
satyapal malik

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి భారత సరిహద్దులో కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో మొహ్మద్‌ సిద్దిఖీ అనే సామాన్య పౌరుడు మృతి చెందాడు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా అమరులయ్యారు. వీరిని హవల్దార్‌ పదం బహదూర్‌ శ్రేష్ట, రైఫిల్‌ మ్యాన్‌ గమిల్‌ కుమార్‌ శ్రేష్టలుగా గుర్తించారు. అంతేకాదు జమ్మూకాశ్మీర్‌లో జరిగే ప్రతి చర్యపై ప్రభుత్వానికి నివేదిక పంప్పుతున్నట్లు చెప్పారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రాంతంలోని కీరాన్‌, తంగ్ధార్‌, నౌగామ్‌ సెక్టార్‌లలో ఉగ్రవాదులు శిబిరాలను మట్టుబెట్టామని, ఈ దాడుల్లో ఇంకా కొందరు ఉగ్రవాదులు మృతి చెందారని రావత్‌ చెప్పారు. వారి వివరాలను త్వరలో బయటపెడతామని రావత్‌ అన్నారు. మొత్తం మూడు శిబిరాలు పూర్తిగా ధ్వంసంకాగా మరో శిబిరం మాత్రం పాక్షికంగా ధ్వంసమైందని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి భారత్‌పైకి మరోసారి కాల్పులకు తెగబడి నేపథ్యంలో ప్రతీకార చర్యల్లో భాగంగా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని కొన్ని ఉగ్రశిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. దీనిపై స్పందించిన జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌ మాట్లాడుతూ భారత సైన్యం సరిహద్దు రేఖ వెంబడి ఉన్న అన్ని ఉగ్రశిబిరాలను పూర్తిగా ధ్వంసం చేస్తుందని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/