ఈ ప్రభుత్వం రైతాంగాన్ని సర్వ నాశనం చేసింది

ఏపి టిడిపి నేత బోండా ఉమ

bonda umamaheswara rao
bonda umamaheswara rao

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వ తీరే కారణమని టిడిపి నేత బోండా ఉమ ఆరోపించారు. కరోనా కిట్ల విషయంలో కూడా భారీ అవినితి జరిగిందని పేర్కోన్నారు. పక్కరాష్ట్రాలు ఒక్కో కరోనా కిట్‌ ను రూ. 300 కు కొంటే ఏపిలో మాత్రం రూ.700 ఖర్చు చేశారని అన్నారు. అదేవిధంగా ఏపి ప్రభుత్వం రైతులను సర్వనాశనం చేసిందని, అన్నారు. రాష్ట్రంలో సమారు యాబైలక్షల టన్నుల ధాన్యం పండగా.. ప్రభుత్వం కనీసం రెండు లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రం లోని జిల్లాల్లో వరి ఎంత పండింది?. ఈ ప్రభుత్వం కోనుగోలు చేసినదెంత?. వాటికి ఎంత డబ్బు చెల్లించారు? అంటు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధాన్యం కోనుగోలుపై ప్రభుత్వ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/