తిరుప్పావై : పాశురం

GODA DEVI
GODA DEVI

అమ్బరమే! తణ్ణీరే! శోరే! అఱమ్‌శెయ్యుమ్‌, ఎమ్బెరుమాన్‌! నన్దగోపాలా! ఎళున్దిరా§్‌ు,
కొమ్బనార్కెల్లామ్‌ కొళున్దే! కులవిళక్కే!
ఎమ్బెరుమాట్టి! యశోదా§్‌ు! అఱివ్ఞఱా§్‌ు,
అమ్బరమ్‌ ఊడఱుత్తుఓంగి యుల కళన్ద,
ఉమ్బర్‌కోమానే! ఉఱంగాతెళున్దిరా§్‌ు
శెమ్‌పొఱ్కళలడిచ్చెల్వా!బలదేవా!
ఉమ్బియుమ్‌ నీయుమ్‌ ఉఱంగేలో రెమ్బావా§్‌ు
భావం: అన్నం కావలసినవారికి అన్నము, దప్పిక అయిన వారికి నీరు, వస్త్రములు లేనవారికి వస్త్రములు ఏ ఆశ లేకుండా దానము చేయువాడు నందగోపాలుడు. అటువంటి నందగోపాలుడిని స్వామిని మేల్కొలుపమని గోపాల వంశపు మణిదీపము అయిన యశోదను, మా స్వామిని లేపవమ్మా అని కోరుతున్నారు. స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో చేయబడిన కడియమును కాలికి తొడుక్కున్న బలరామా, నీవన్నా నీ తమ్ముడుని మేల్కొలుపుము. ఆకాశ మధ్యభాగమును చీల్చుకొన లోకములన్నింటిని కొలిచిన త్రివిక్రమా అని పొగుడుతూ నిత్య శూరులకు నాయకుడా నిదరింపరాదు మేలుకో అని కృష్ణుడిని కోరుతున్నారు.
ఫలం: విశ్వాసం కలుగుతుంది

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/