తిరుప్పావై :పాశురం

GODA DEVI
GODA DEVI

అంగణ్‌ మా జాఙలత్త రశర్‌ : అభిమాన బంగ మా§్‌ు
వన్దు నిన్‌ పళ్ళిక్కట్టి ఱ్కీళే
శంగ మిరుప్పార్‌ పోల్‌ వన్దు తలైప్పెయిదోమ్‌
కింగిణివా§్‌ు చ్చె§్‌ుత తామరైప్పూప్పోలే
శెంగణ్‌ శిఱిచ్చిఱిదే యేమ్మేల్‌ విళియావో తింగళు
మాదిత్తియను మెళున్దాఱ్పోల్‌
అంగణిరండుంగొణ్డెంగళ్‌ మేల్‌ నోక్కు తియేల్‌
ఎంగళ్‌మేల్‌ శాబమిళిన్దేలో రెమ్బావా§్‌ు
భావం: సుందరమైన, విశాలమైన ప్రదేశములను ఏలుతున్న ఎంతో మంది రాజులు తమకంటే గొప్పవారు లేరని అహంకారము వీడి, తాము సయించిన సార్వభౌముని సింహాసనము క్రింద సమూహములు చేరినట్లు, మేము కూడా నీ సింహాసము క్రింద గుంపులు గుంపులుగా చేరి నాము. గోపికలు కృష్ణునితో అంటున్నారు. చిరుగంట ముఖ మువలె విడియున్న తామరపూలను పోలిన, వాత్సల్యముతో ఎర్రగానున్న, నీ కనులను మెలమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయుము. సూర్యచంద్రులు ఆకాశములో ఒకేసారి కనబడితే ఎంత ఆనందం ఉంటుందో, ఆ అందముగల నీ రెండు నేత్రములు మాపై పడునట్లు చేయి. అప్పుడు ఏవైన శాపములుంటే అవి తొలగిపోతాయని వెలుపలి గోపికలు కృష్ణునితో చెపుతున్నారు.
ఫలం: అహంకారం నశిస్తుంది

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/