నందిమేడారం మూడో మోటర్ వెట్ రన్ విజయవంతం

nandi-medaram-pump
nandi-medaram-pump


హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్తం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్దపల్లి జిల్లా మండలం నందిమేడారం వద్ద ఆరో ప్యాకేజిలో మూడో పంపు వెట్‌ఆర్‌ను అధికారులు ఈరోజు విజయవంతగా పరీక్షించారుసర్జ్‌పూల్‌లోని నీటిని మూడో పంపు ఎత్తిపోసింది.తాజా వెట్‌రన్‌తో ఆరో ప్యాకేజీలోని మూడు పంపుల పరీక్ష విజయవంతంగా పూర్తయింది. ఇవాళే మరో పంపును కూడా అధికారులు పరీక్షించనున్నారు. మిగతా పంపులను మరికొన్ని రోజుల్లో పరీక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.మూడో పంపు వెట్ రన్‌ను నీటి పారుదల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్ రావ్ దేశ్ పాండే, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు ప్రారంభించారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/