జార్ఖండ్‌లో మూడో విడత పోలింగ్‌ ప్రారంభం

సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్

polling
polling

రాంచీ: జార్ఖండ్‌లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా రాంచీ, హథియా, కాంకె, బర్కతా, రామ్‌గర్ ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడు గంటలకు పోలింగ్ ముగియనుంది. మూడో విడతలో భాగంగా మొత్తం 17 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా, బరిలో 306 మంది అభ్యర్థులు ఉన్నారు. 56,18,267 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 86 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి వినయ్ కుమార్ చౌబే తెలిపారు. జార్ఖండ్‌లో మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, తొలి విడత గత నెల 30న జరిగింది. ఈ నెల 7న రెండో విడత ఎన్నికలు జరగ్గా, నేడు మూడో విడత పోలింగ్ జరుగుతోంది. 16న నాలుగు, 20న ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/