ప్రారంభమైన తుది దశ పరిషత్‌ పోలింగ్‌

voters
voters

హైదరాబాద్‌: తెలంగాణలో స్థానికి పరిషత్‌ ఎన్నికల తుది దశ పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 27 జిల్లాల్లో 9,494 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో విడుతలో 30 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా, 160 జడ్పీటీసీ, 1708 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మూడో విడుతలో భాగంగా 160 జడ్పీటీసీ స్థానాలకు 741 మంది అభ్యర్థులు, 1708 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/