వీరంతా 2022 వరకు పోటీ చేయరాదు

CEO Rajath Kumar
CEO Rajath Kumar

హైదరాబాద్‌: 2014వ సంవత్సరంలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల నియమావళి మేరకు వ్యవహరించని 62 మంది అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఇందులో 45 మంది శాసనసభకు, 17 మంది లోక్‌సభకు పోటీ చేసిన వారుగగ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖఖశాసనసభ ఎన్నికల్లో 21 నియోజకవర్గాల నుంచి 45 మంది పోటీ చేశారు. 2020 జూన్‌ వరకు ఎన్నికల పోటీ చేసేందుకు వారు అనర్హులు. కొల్లాపూర్‌ నుంచి అత్యధికంగా ఎనిమిది మందిపై వేటు పడింది. షాద్‌నగర్‌, గద్వాల్‌ నుంచి అయిదుగురు చొప్పున, రామగుండం నుంచి నలుగురు, సిరిసిల్ల, నారాయణపేట, వనపర్తి, ఆలంపూర్‌ ఇద్దరు చొప్పున అనర్హత వేటుకు గురయ్యారు. కామారెడ్డి, ధర్మపురి, పినపాక, ఇల్లెందు, ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, హుస్నాబాద్‌, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున అనర్హులు. లోక్‌సభకు పోటీ చేసిన 17 మంది అభ్యర్థులు 2022 జనవరి వరకు అనర్హులు. కరీంనగర్‌, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ఆరుగురు, సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసిన అయిదుగురు అభ్యర్థులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. వారంతా ఆయా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినవారే.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/