ఈ తప్పులు మళ్లీ పునరావృతం కావు!

Shreyas Iyer
Shreyas Iyer


న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సన్‌రైజర్స్‌ చేతిలో పారాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సారథి శ్రయాస్‌ అయ్యర్‌ 41 బంతుల్లో 43 పరుగులు చేసినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. మ్యాచ్‌ అనంతరం జట్టు ప్రదర్శనపై శ్రయాస్‌ మాట్లాడాడు.
వరుస ఓటములు, భారీ స్కోరు తేడాతో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని, కోట్లా పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదని శ్రయాస్‌ అయ్యర్‌ అన్నారు. మొదటగా బ్యాటింగ్‌ చేసిన తమ జట్టు ప్రత్యర్థి ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచాలని అనుకున్నాం కాని వరుసగా వికెట్లు పడిపోవడంతో అనుకున్న లక్ష్యాన్ని నిర్ధేశించలేకపోయాం. ఈ మ్యాచ్‌లో బౌలర్లు తమ శక్తిమేర ప్రదర్శన చేశారు. కానీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. ఈ మ్యాచ్‌ నుంచి పాఠాలు నేర్చుకుని ఈ తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా చేస్తాం అని శ్రయాస్‌ అభిప్రాయపడ్డారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/