కరోనాను ‘చైనీస్ వైరస్’ అంటూ ట్రంప్ ట్వీట్
నిందించడం మానేసి వైరస్‌ను కట్టడి చేయాలన్న చైనా
వాషింగ్టన్: ప్రపంచదేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్‌ను ‘చైనీస్ వైరస్’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ‘చైనీస్ వైరస్’ ప్రభావం వల్ల నష్టపోతోన్న ఎయిర్‌లైన్స్ వంటి పరిశ్రమలకు అమెరికా పూర్తిగా సహకారం అందిస్తుందని, తిరిగి గతంలో ఎన్నడూ లేనంత బలంగా తాము తయారవుతామని అన్నారు. అయితే ట్రంప్ ట్వీట్‌పై చైనా సీనియర్ అధికారి యంగ్ జేచీ స్పందిస్తూ… కరోనా నియంత్రణకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే, ట్రంప్ కామెంట్లు సరైన రీతిలో లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాను నిందించడం మానేయాలని, వైరస్ నియంత్రణకు పనిచేయాలని చెప్పుకొచ్చారు. కాగా, అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు వేల మందికి పైగా కరోనా సోకింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/