ప్రభుత్వానికి వ్యతిరేకంగా 58 కోర్టు తీర్పులు వచ్చాయి

సిఎంగా కొనసాగే అర్హత జగన్ కు లేదు

Gorantla Butchaiah Chowdary
Gorantla Butchaiah Chowdary

అమరావతి: టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ అంశానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు 58 కోర్టు తీర్పులు వచ్చాయని ఆయన అన్నారు. సిఎం స్థానంలో కొనసాగే అర్హత జగన్ కు లేదని… ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ నియంతృత్వ పోకడల వల్ల అధికారులు కోర్టు బోనుల్లో నిలబడాల్సి వస్తోందని చెప్పారు. జగన్ అక్రమాస్తుల కేసు ఎనిమిదేళ్లుగా వాయిదా పడుతూ వస్తోందని… కేసు విచారణను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/