నిర్ణయాధికారం ఉండాలి

-జీవన వికాసం

There must be decision-making
There must be decision-making

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. వ్యాపార రంగంలో తమ దైన ముద్ర వేస్తున్నారు. పట్టుదలతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

అయితే మరి నిర్ణయాలు తీసుకునే విషయంలో సొంతంగా వ్యవహరించగలుగుతున్నారా? తీసుకునే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నారా అంటే ఒక సర్వే ద్వారా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి.

పెట్టుబడుల రంగంలో ఉన్న స్త్రీపురుషులిద్దరి లక్ష్యాలు ఒకే విధంగా ఉంటాయి. పెళ్లి ఆ తరువాత పిల్లలు. మరి పుట్టిన పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వాలి.

అప్పుల భారం లేకుండా జీవితాన్ని కొనసాగించాలి. సొంత ఇల్లు కట్టుకోవాలి. ముఖ్యంగా ఇల్లు, వాహనాలు నభూమి కొనుగోలు చేసే విషయంలో మహిళలు స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నారు.

వారిపై భర్త లేదా తండ్రి ఆధిపత్యం ఉంటోంది. అదే బంగారం కొనుగోలు, నిత్యావసర వస్తువులు, గృహాలంకరణ వస్తువుల కొనుగోలు విషయంలో అయితే మహిళలు స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నారు.

పెట్టుబడుల రంగంలో పురుషుల ంటే మహిళలే అధికంగా ఉన్నారు. ఫండ్‌ మేనేజర్లుగా మహిళలు తమ సత్తా చాటుతున్నారు. కానీ వారి శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదనే చెప్పుకోవాలి.

ఈ రంగంలో అసలు వారిని పట్టించుకునే వారే కరువవుతున్నారు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయంలో మహిళలకు స్వతంత్రత లేదు.

33 శాతం మంది మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోగలుగుతున్నారు

. మిగిలిన వారు మాత్రం పురుషుల నిర్ణయానికి తలొగ్గాల్సివస్తోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పెట్టుబడుల రంగంలోకి అడుగుపెట్టిన మహిళలు మిగిలిన వారితో పోలిస్తే చాలా స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు.

13 శాతం మంది మహిళలు తమకు ఇష్టం లేకపోయినా పెట్టుబడుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్వేలో తేలింది.

ఇందుకు వారి భర్త, లేదా తండ్రి చనిపోవడమే కారణమని వెల్లడయింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే తండ్రులతో పోలిస్తే భర్తలే మహిళలను పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తున్నారు.

తమ కుమార్తెలను ప్రోత్సహించే తండ్రులు 27శాతం ఉంటే భర్తలు మాత్రం 40 శాతం ఉంటున్నారు.ఈ సర్వే ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, ఇండోర్‌, కొచ్చి లూథియానా, గువాహతీ నగరాల్లోచేపట్టారు.

ఈ సర్వేలో 25నుండి అరవై యేళ్ల మధ్య వయసు ఉన్న వారు 1853 మంది పురుషులు, 2160 మంది మహిళలు పాల్గొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/