లోపలికి అనుమతించేది లేదు

లాక్‌డౌన్‌ ఉద్దేశ్యం అదే.. డీజిపి గౌతం సవాంగ్‌

goutham sawang
goutham sawang

అమరావతి: హైదరాబాద్‌లో హస్టళ్లను మూసివేయడంతో యువత వారివారి స్వస్థలాలకు పయనమయ్యారు. దీంతో ఏపీకి వెళ్లె వారిని తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆపివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై ఏపి డీజిపి గౌతం సవాంగ్‌ స్పందిస్తూ, కరోనాను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిందని, కాబట్టి ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు. లాక్‌డౌన్‌ నిబందనలకు విరుద్దంగా ఎవరిని లోపలికి అనుమతించేది లేదని అన్నారు. రెండు వారాల క్వారంటైన్‌ తరువాతే వారిని లోనికి అనుమతిస్తామని వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి కాకుండా చూడడమే లాక్‌ డౌన్‌ ఉద్దేశ్యం అని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/