తెలంగాణలో కరోనా వైరస్‌ లేదు

అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు : సీపీ

Cyberabad CP Sajjanar

Hyderabad: తెలంగాణలో కరోనా వైరస్‌ లేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయన స్క్రీనింగ్‌ పరికరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయన్నారు.

సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌, శానిటైజర్‌ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఎయిర్‌పోర్టులో 200 మంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నారన్నారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/