కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగిపోతోంది

రాహుల్ గాంధీ ఓ కోటరీని ఏర్పరుచుకున్నారు.. ఖుష్బూ

khushboo

న్యూఢిల్లీ: సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్‌ పార్టీని వీడి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోందని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించాలని ఖుష్బూ అన్నారు. రాహుల్ చుట్టూ ఒక కోటరీని ఏర్పరుచుకున్నారని… కొత్తగా వచ్చే వారిని అందులోకి అనుమతించరని చెప్పారు. ఆయన చుట్టూ ఉన్నవాళ్లు పారదర్శకంగా ఉండరని అన్నారు. కాంగ్రెస్ లో తనను అణచి వేయడానికి ఎందరో ప్రయత్నించారని చెప్పారు. బిజెపిలో చేరాలని తనకు చాలా కాలం క్రితమే ఆఫర్లు వచ్చాయని తెలిపారు. అయితే పార్టీ మారలేనని అప్పట్లో బిజెపి నేతలకు చెప్పానని… చివరకు పునరాలోచించుకుని బిజెపిలో చేరానని చెప్పారు. కాంగ్రెస్ లో తనకు జరిగిన అవమానాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఖుష్బూ అన్నారు. అయితే తనను అణచి వేయాలనుకున్న వారి పేర్లను మాత్రం బహిరంగంగా వెళ్లడించనని సోనియాగాంధీకి రాసిన లేఖలో అన్ని వివరాలను వెల్లడించానని చెప్పారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/