ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుంది

కావాలంటే కడపలోనో, పులివెందులలోనో రాజధానిని పెట్టుకొండి

J. C. Diwakar Reddy
J. C. Diwakar Reddy

అమరావతి: రాజధానిని ముక్కలు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టిడిపి మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి హెచ్చరించారు. రాజధానిని కావాలంటే కడపలోనో, పులివెందులలోనో పెట్టకోమని చెప్పారు. రాయలసీమ ప్రజలకు విశాఖపట్టణం చాలా దూరమవుతుందని దాని వల్ల సీమ ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని జేసీ పేర్కొన్నారు. ఇంకా రాయలసీమకు హైకోర్టు రావడం వల్ల ఒరిగేది ఏమీ లేదని మహా అయితే ఓ 10 జిరాక్స్‌ షాపులు వస్తాయని అంతకు మించి సీమ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. రాజధానిని మార్చడం వైఎస్‌ఆర్‌సిపి నేతలు చెబుతున్న సులభం కాదని చెప్పారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని జేసీ దివాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వాన్ని పదేళ్లు నడిపించవచ్చని తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/