బీసీల నిధుల్లో భారీగా కోతలు పెడుతున్నారు
బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు ముఖ్యమంత్రి జగన్‌కు ఇష్టం లేదు!

అమరావతి: బీసీలపై కక్షతోనే రిజర్వేషన్ల అంశం కేంద్రం దృష్టికి ముఖ్యమంత్రి జగన్ తీసుకెళ్లలేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 15 వేల పోస్టులు రాకుండా జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. టిడిపి వెన్నెముక బీసీలని తెలిసే వారిపై వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కక్షగట్టిందని అన్నారు. బీసీ నిధుల్లో భారీగా కోతలు పెట్టారని, ఆదరణ పథకం రద్దు చేశారని అన్నారు. బీసీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారని ..ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఇప్పుడు పేదల అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/