బిజెపికి మెజారిటీ ఉంటే ఆపరేషన్ కమల్ ఎందుకు?

సీబీఐ, ఈడీ, ఐటీ, పోలీసు శాఖల అధికారులను వినియోగించుకున్నారు

sanjay raut
sanjay raut

ముంబయి: శివసేన నేత సంజయ్ రౌత్ మరోసారి బిజెపిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘ఆపరేషన్ కమల్ కోసం బిజెపి.. నాలుగు
వ్యవస్థల్లోని వారిని  వినియోగించుకుంటోంది.. వారే సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను, పోలీసు శాఖల అధికారులు. కానీ, మహారాష్ట్రలో వారి ప్రయత్నాలు ఫలించలేదు. బిజెపికి నిజంగా మెజారిటీ ఉంటే ఆపరేషన్ కమల్ ప్రయత్నాలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని సంజయ్ రౌత్ తెలిపారు. ‘అజిత్ పవార్ కు మద్దతు తెలుపుతూ వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు. గురు గ్రామ్ లోని ఓ హోటల్ వేదికగా ఈ ఆపరేషన్ జరిగింది. నిన్న రాత్రి శివసేన, ఎన్సీపీ నేతలు అక్కడకు వెళ్లి ‘రెస్క్యూ ఆపరేషన్’ కొనసాగించారు’ అని తెలిపారు. వారికి అక్కడి నుంచి తీసుకొచ్చారని వివరించారు. ‘బిజెపి తమను బెదిరింపులకు, ప్రలోభాలకు గురి చేసిందని గురుగ్రామ్ లోని హోటల్ లో ఉన్న ఎమ్మెల్యేలు చెప్పారు’ అని వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/