ఐపిఎల్‌లో అత్యంత పిన్నవయస్కుడు ప్రయాస్‌ బర్మన్‌…

Prayas Ray Barman
Prayas Ray Barman

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌0లో మరో యువ క్రికెటర్‌ అరంగేట్రం చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తరుపున ప్రయాస్‌ రే బర్మన్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు. పలితంగా ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్నవయస్కునిగా ఈలెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ప్రయాస్‌ బర్మన్‌ 16ఏళ్ల 157 రోజుల వమసులో ఐపిఎల్‌లో అరంగేట్రం చేశాడు. దాంతో ఇప్పటివరకు ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌ పేరిట ఉన్న రికార్డును ప్రయాస్‌ సవరించాడు. ముజిబ్‌ ఉర్‌ 17ఏళ్ల 11 రోజుల వయసులో ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ప్రయాస్‌, ముజిబ్‌ ఉర్‌ తర్వాత స్థానాల్లో సర్పరాజ్‌ ఖాన్‌ (17ఏళ్ల 177 రోజులు), ప్రదీప్‌ సంగ్వాన్‌ (17ఏళ్ల 179 రోజులు), వాషింగ్టన్‌ సుందర్‌ (17ఏళ్ల 199 రోజులు)లు వరుసగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి టాస గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆర్‌సిబి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ముందుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/