ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ ల్యాప్‌టాప్‌ వేలం

laptop
laptop

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ ల్యాప్‌టాప్‌గా పేరొందిన ఎలక్ట్రానిక్‌ి డివైజ్‌ వేలానికి వచ్చింది. అయితే దీని వేలం నిర్వహించగా..1.3 మిలియన్‌ డాలర్లు పలకడం విశేషం. కాగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు, కంపెనీలకు ఆర్థికంగా 95 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చేకూర్చిన ఆరు ప్రమాదకర వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉండటంతో దీనికి ఆ పేరువచ్చింది. ది పర్సిస్టెన్స్‌ ఆఫ్‌ ఖోస్‌ గా పేర్కొనే ఈ డివైజ్‌లో.. ప్రపంచాన్ని గడగడలాడించిన వాన్నాక్రై, ఐలవ్‌యూ, డార్క్‌ ఎనర్జీ, సోబిగ్‌, మైడూమ్‌, డార్క్‌టెక్విలా వైరస్‌లు,రాన్సమ్‌వేర్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన వైరస్‌లతో కూడిన ల్యాప్‌టాప్‌ను గ్యూ ఓ డాంగ్‌ అనే ఇంటర్నెట్‌ ఆర్టిస్ట్‌ రూపొందించాడు. వైరస్‌లపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు.. ఇలాంటివి భౌతికంగా మనపై దాడి చేస్తాయని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/