ప్రపంచం తీవ్ర సంక్షోబాన్ని చూడబోతుంది

అభివృద్ది చెందుతున్న దేశాలకు ఇది పెద్ద సవాలుగా మారనుంది: ఐఎంఎఫ్‌

kristalina georgieva
kristalina georgieva

వాషిగ్టన్‌: కరోనా కారణంగా 2020లో ప్రపంచం తీవ్ర ఆర్దిక మాంద్యాన్ని ఎదుర్కోబోతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలిన జార్జివా అన్నారు. 2020 లో ప్రపంచం తీవ్ర సంక్షోబాన్ని చూడబోతుందని , ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాలకు ఇది పెద్ద సవాలుగా మారనుందని అన్నారు. ఈ ఏడాది తొలి అర్దబాగంలో భారీ ఎత్తున కోత తప్పదని హెచ్చరించారు. ఆర్ధిక వ్యవస్థలు కోలుకోవడం అనేది వ్యాక్సిన్‌ల అభివృద్ధి, థెరపిల మీద ఆధారపడి ఉంటుందని, ప్రజారోగ్యానికి మెరుగైన చర్యలు తీసుకుంటే ఆర్ధిక వ్యవస్థ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో పుంజుకోవచ్చని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/