రికార్డులకెక్కిన ఆఫ్రీకా ఖండం

పోలియోపై విజయం సాధించిన ఆఫ్రికా..డబ్ల్యూహెచ్ఓ ప్రశంస

World Health Organization Declares Africa Polio-Free

ఆఫ్రికా: పోలియోను జయించిన ఖండంగా ఆఫ్రికా రికార్డులకెక్కింది. గత నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఈ ఖండంలో నమోదు కాకపోవడంతో ఆఫ్రికాను పోలియో రహిత ఖండంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆఫ్రికా దేశమైన ఈశాన్య నైజీరియాలో చివరిసారి నాలుగేళ్ల క్రితం ఒకే ఒక్క పోలియో కేసు నమోదైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు దాని ఉనికి లేదు. పోలియోను తరిమికొట్టడంలో ప్రభుత్వం, దాతలు, ఆరోగ్యకార్యకర్తలు, కమ్యూనిటీలు చేసిన కృషి ప్రశంసనీయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. వారి కృషి ఫలితంగా 1.8 మిలియన్ మంది చిన్నారులు పోలియో నుంచి బయటపడ్డారని కొనియాడింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/