ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొని తీరాల్సిందే!

trump
trump


వాషింగ్టన్‌: వాణిజ్య యుధ్దాలు ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టమైన సందేశం పంపించారు. వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్‌, వరల్డ్‌బ్యాంక్‌ స్ప్రింగ్‌ మీటింగ్స్‌ కోసం ఆర్థిక విధాన కర్తల సమావేశంలో ఆయన ఆ సందేశాన్ని వెల్లడించారు. బలహీన పడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొని తీరాల్సిందేనని ట్రంప్‌ సందేశం ఇచ్చారు. తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి దిగుమతి అయ్యే 11 బిలియన్‌ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, చీజ్‌ వంటి వాటిపై పన్నులు విధించారు. ఒక పక్క చైనాతో ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతూనే మరో పక్క వివిధ దేశాలతో ఉన్న వాణిజ్య ఒప్పందాలను పునర్‌ లిఖించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంతో ట్రంప్‌ చర్యలపై ఆర్థిక వేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/