ఓటు గడువు పెంచం

GOPALKRISHNA DWIVEDI
GOPALKRISHNA DWIVEDI

అమరావతి: ఏపిలో రేపటితో ఓటు హక్కు నమోదు కార్యక్రమం ముగుస్తుందని, దరఖాస్తు గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించోమని ఏపి ఎన్నికల కమిషనర్‌ గోపాల్‌ కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఓటరుదేనని, ఇప్పుడు చూసుకోకుండా జాబితాలో ఓటు లేదని ఎన్నికల సంఘాన్ని నిందించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఓటర్ల నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని, 7 నుంచి 9 శాతం వరకూ ఓటర్లు పెరిగే అవకాశం ఉందని ద్వివేది అన్నారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.95 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. జనవరి 11కు ముందు 20 లక్షల కొత్త ఓట్లను జాబితాలో చేర్చామన్నారు. వారికి కార్డుల పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారికి కూడా మార్చి 31వ తేదీలోగా కార్డులు ఇస్తామన్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి అని రాజకీయ పార్టీలు ఈసీకి సహకరించాలని ద్వివేది కోరారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/