అప్పటి నుంచే వైరస్ ప్రస్థానం !

అంతర్జాతీయ న్యూస్ ఛానల్  సంచలన కథనం

The Wuhan lab at the core of a virus controversy

కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమంటూ అంతర్జాతీయ న్యూస్ ఛానల్  సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. కరోనా వైరస్ వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి బయటకొచ్చిందని, అప్పటి నుంచి వైరస్ ప్రస్థానం మొదలైందని ఆ కథనం  పేర్కొంది.

ఇనిస్టిట్యూట్ వైరాలజీలో కరోనా లాంటి ఎన్నో వైరస్ లపై ప్రయోగాలు చేస్తుంటారని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.

ఈ అధ్యయనంలో భాగం పంచుకున్న ఓ విద్యార్థి  చేసిన చిన్న పొరపాటుతో ఈ కరోనా వైరస్ ఆమెకు సోకిందనీ, ఆమె  ప్రియుడు ఇనిస్టిట్యూట్ సమీపంలో ఉన్న మాంసం కొనుగోలు చేయడం ద్వారా అతని నుంచి  వైరస్ ఇతరులకు వేగంగా సోకిందన్నది ఆ కథనం సారాంశం.

ఈ కథనం ప్రసారం అయిన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. దీనిపై వివరాలు సేకరిస్తున్నట్లు  పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తికి చైనానే కారణమంటూ తాను చేసిన వ్యాఖ్యలకు  ఆ న్యూస్ చానల్ కథనం బలం చేకూరుస్తున్నదని ట్రంప్ పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/