వికృత మనస్తత్వం మారాలి

ఇందుగలడందు లేడను సందేహం వలదు.. అన్నట్లు మహిళలు లేని రంగమే లేదంటే అతిశయోక్తి ఏ మాత్రం కాదు.

The unruly mentality must change

పని మనిషి నుంచి పర్వతారోహకు రాలి వరకు, హోం మేకర్‌ నుంచి హోం మినిస్టర్‌ వరకు, శారీరకంగా అబల కావచ్చు గానీ మనోధైర్యంతో అంతరిక్ష వ్యోమగామి వరకూ ఎదుగుతూ తన విజయ పరంపర కొనసాగిస్తూనే ఉంది.

నిజానికి మానసికంగా మగవాడు, శారీరకంగా మహిళ దుర్భలులని తెలిసి కేవలం మహిళను మాత్రమే అబలగా పేర్కొనటం హాస్యాస్పదం.

ఎంతో దీర్ఘ దృష్టి కలిగి, తన బాధ్యతను తన వారి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించే ఆమె ఏక కాలంలో అనేక ఆలోచనలు, అనేక పనులు చేయగలదని సైంటిస్టులే నిరూపించడం జరిగింది.

అటువంటి మహిళకు పురుషునికి లభించినంత సహకారం, ప్రోత్సాహం, అవకాశాలు నేడు ఎంత పురోగతి సాధించిన దేశాల్లో అయినా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

వ్యవస్థలో ఇంకా మార్పు రాకపోవటం.

తల్లిదండ్రులు చాలా వరకు ఉద్యోగం చెయ్యాలా? ఊళ్లేలాలా? అన్న పాత తరం నుంచీ ఉద్యోగం చేసి కూతుళ్లు తమ కాళ్లపై నిలవాలని, అలాగే కోడలు కూడా ఉద్యోగం చేసినా మంచిదే అని భావించే స్థితికి వచ్చారు.

అలాగే ప్రభుత్వాలు కూడా అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తోంది. అయితే, కొందరు కుత్సిత బుద్ధులు, అసూయపరులు, మూర్ఖులు, వికృత మనస్కులు మాత్రము మరలేదు .

సామాజిక మాధ్యమాలలో మంచిని వదిలి చెడునే వెదుక్కుంటూ అన్నిటికీ అవరోధమవ్ఞతున్నారు.

ఇటువంటివాళ్లు కార్యాలయాల్లో అయితే ఈర్ష్యతో వ్యంగ్యపు మాటలు సంధిస్తూ, బయట అయితే మహిళను మనిషిగా అయినా కాకుండా ఒక లైంగికావసర వస్తువ్ఞలా చూస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు.

ఇటువంటి వాళ్లు సమాజానికి పట్టిన చీడపురుగులై అభివృద్ధికి ఆటంకాలుగా పరిణమిస్తున్నారు.

అందువల్ల ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు తమ కూతుళ్లకు కావలసినంత స్వేచ్ఛ పరిధులు లేకుండా ఇవ్వటానికి సంశయించాల్సిన అవసరం ఏర్పడుతోంది.

మరోవైపు హద్దులు చెరిపేసి సామాజిక చైతన్యం దిశగా కాకుండా మూస ధోరణితో ఒక ఎక్స్‌ పోజింగ్‌కి అవసరమైన క్యారెక్టర్‌గా సినిమాల్లోను, కుట్రలు కుతంత్రాలతో కుటుంబాల్ని నాశనం చేసే విలన్లలా సీరియళ్లలోనూ చూపించటం మానాలి.

  • డేగల అనితాసూరి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/