టైటిల్ ఖరారు అవ్వలేదు…
అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్వకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయ్యింది.ఈచిత్రానికి సంభందించి ఒక టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతొంది. కానీ చిత్ర యూనిట్ ఈ మూవీకి ఎటువంటి టైటిల్ ఖరారు చెయ్యలేదు. కొన్ని వెబ్ సైట్స్ లో ఈ మూవీకి టైటిల్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదు. టైటిల్ ఖరారు అవ్వగానే చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. అల్లు అర్జున్ కి ఇది 20వ సినిమా అవ్వడం విశేషం. సుకుమార్ తో బన్నీ చేస్తున్న మూడో సినిమా ఇది.
తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/devotional/