మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

The third day of the AP assembly meetings began

అరావతిః మూడో రోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం, వరదల్లో ఆహార సరఫరాదారులకు బిల్లుల చెల్లింపు, ప్రభుత్వ ఖాతాల్లో నిధుల వినియోగంపై టిడిపి సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. అలాగే అంబేద్కర్ విదేశీవిద్యా పధకంలో అక్రమాలు, రాష్ట్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ల కొరతపై వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు.

ఈరోజు సభలో ఐదు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరో మూడు బిల్లులపై చర్చ జరుగనుండగా… సభ ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, ఆర్థిక పురోగతిపై చర్చ కొనసాగనుంది. విద్యా వైద్య రంగాల్లో నాడు – నేడుపై సభలో చర్చ జరుగనుంది. వ్యవసాయ అనుబంధ రంగాలపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది. మరోవైపు ఈరోజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగనుంది. శుక్రవారం కోలగట్ల వీరభద్రస్వామి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల ఎంపిక లాంఛనం కానుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/