ఏపి చెక్‌పోస్టు పొందుగల వద్ద ఉద్రిక్తత

స్వస్థలాలకు వెళ్ళేందుకు వేలాదిమంది ఎదురుచూపు
భారీగా నిలిచిపోయిన వాహనాలు
ఏపిలోకి ప్రవేశం లేదు: పోలీసులు వెల్లడి

AP Police at Checkpost

దాచేపల్లి (గుంటూరుజిల్లా): కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా దేశప్రధాని నరేంద్రమోది దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించిన నేపద్యంలో దాచేపల్లి మండలం పొదుగల చెక్‌పోస్టు బ్రిడ్జి వద్ద భారీగా పోలీసులు మొహరించారు. హైదరాబాదు నుండి ఏపికి పయనమైన విద్యార్దులు,ఉద్యోగులకు ఏపి పోలీసులు రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వడం లేదు. దాచేపల్లి మండలం ఏపి చెక్‌పోస్టు పొందుగల బ్రిడ్జివద్ద తెలంగాణా నుండి తమ స్వస్దాలకు వెళ్ళేందుకు అనుమతి కోసం వేలాది మంది గురువారం ఎదురు చూస్తున్నారు.

ఏపి పోలీసులు మాత్రం ఇతర రాష్ట్రాల వారికి అనుమతి లేదు అంటూ ఎవ్వరికి అనుమతి ఇవ్వడం లేదు.అలాగే గుంటూరు వైపు నుండి హైదారాబాదుకు వెళ్ళేందుకు వాహనాలను
శ్రీనగర్‌ పోలీసు చెక్‌పోస్టు వద్ద నిలిపివేయడం జరిగింది.దీంతో హైదరాబాదు వైపు వెళ్ళే వాహనాలు 3కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

Passengers Dharna

హైదరాబాదు నుండి హాస్టళ్ళలో,వుంటున్న విద్యార్దులు ఉద్యోగులు తమ స్వస్దలాలకు వెళ్ళందుకు ఎన్‌ఓసీ తీసుకొని బుధవారం రాత్రి నుండి బయలుదేరినా ఏపి
ి బోర్డర్‌ చెక్‌పోస్టు పొందుగల బ్రిడ్జి వద్ద పోలీసులు ఏపిలోకి అనుమతి ఇవ్వడం లేదు.దీంతో ఏపి,తెలంగాణా సరిహద్దు పోందుగల చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు,వేలాది మంది నిలిచి పోయారు.తమను రాష్ట్రంలోకి అనుమతించాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

ఏపి పోలీసులు మాత్రం మీరు తీసుకొన్న అనుమతి తెలంగాణకు మాత్రమే నని మాకు ఎటువంటి అనుమతులు లేవని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఇతర రాష్ట్రాల నుండి ఎవ్వరిని
అనుమతించబోమని తేల్చిచెప్పారు.

Road Closed near checkpost

దీంతో పోలీసులతో ప్రజలకు వాగ్వివాదం చోటుచేసుకొని ఉద్రిక్తత వాతావరణం నెలకొంది..ఏపి బోర్డర్‌కు వచ్చిన వారిని తిరిగి తెలంగాణాకు పంపించడం జరిగింది.

Traffic near checkpost

ఆంద్రా బోర్డర్‌ చెక్‌పోస్టు పొందుగల బ్రిడ్జిని జిల్లా రూరల్‌ ఎస్‌పి విజయరావు సందర్శించి రాకపోకలను ఇనుప కంచెలతో నియంత్రించారు. ఎవ్వరైనా ఆంద్రాలోకి రావాలంట కోరంటైన్‌కు వైద్య పరీక్షలకు సిద్దపడిన వారిని మాత్రమే అనుమతిస్తామని ఆయన స్పస్టం చేసారు.

అడిషనల్‌ ఎస్‌పి చక్రవర్తి ,ఆర్‌డిఓ జగన్నాదంపార్దసారధి,తహాశీల్దార్‌ గర్పెపూడి లేవి తదితర పోలీసులు అధికారులు పొందుగల చెక్‌పోస్టును సందర్శించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/