ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం

Maoist
Maoist

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. సరిహద్దు ప్రాంతంలో గల హంతల్‌గూడలో గ్రామస్థులకు, మావోయిస్టులకు మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. గ్రామస్థులు రాళ్లతో మావోయిస్టులపై దాడి చేశారు. ఈ ఘటనలో మావో ఏరియా కమిటీ సభ్యుడు హడ్మా అనే వ్యక్తి మృతి చెందాడు. అంతేకాకుండా హడ్మాతోపాటు ఉన్న మరో ఏరియా కమిటీ సభ్యుడు జిప్రోకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన బిఎస్‌ఎఫ్‌ బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిప్రోను బిఎస్‌ఎఫ్‌ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గణతంత్ర వేడుకను నిర్వహించకూడదని చెప్పేందుకే మావోయిస్టులు హంతల్‌గూడ వచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని స్థానికులు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/