ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఝలక్‌

ఏపీ పిటీషన్‌ను కొట్టివేశిన సుప్రీం

supreem court
suprem court

దిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. ఏపీ లోని పంచాయితి కార్యాలయాలపై అధికార పార్టి రంగులు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేసింది. దీనిని విచారించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయ రంగు వేస్తే మీరు సమర్ధిస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తూ పిటీషన్‌ను కొట్టివేసింది. కాగా ఇటీవల రాష్ట్ర హైకోర్టు పంచాయితీ కార్యాలయాలకు అధికార పార్టి రంగులు వేయడంను ఖండించింది, ప్రభుత్వ భవనాలకు పార్టీల రంగులు వేయవద్దని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/