వీవీ ప్యాట్‌లపై విచారణ వాయిదా

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: ఏపి సిఎం చంద్రబాబు నేతృత్వంలో 22 పార్టీల నేతలతో కలిసివీవీ ప్యాట్ల కేసుకు సంబంధించిసుప్రీంకోర్టులో పిటీషన్ వేసిని విషయం తెలిసిందే. అయితే ఈరోజు వీవీ ప్యాట్‌లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం వచ్చే సోమవారం నాటికి వాయిదా వేసింది. ఈసీ కౌంటర్‌ అఫిడవిట్‌పై పిటిషనర్‌ తరపు న్యాయవాదులు సమయం కోరారు. వారి విజ్ఞప్తి మేరకు సీజేఐ గొగోయ్‌ ధర్మాసనం శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని సూచిస్తూ.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్త క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/