ఇవి పాటిస్తే ఒత్తిడి మాయం

ఆరోగ్యానికి చిట్కాలు:

Drinking water
Drinking water

ఉదయం నిద్ర లేవగానే పరగడుపున రెండు మూడు గ్లాసుల గోరువెచ్చని మంచి నీరు తాగాలి. రోజూ కనీసం పదిహేను నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

వారానికి ఒక రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. ఉపవాసం ఉన్న రోజులో కేవలం మంచినీరు తాగాలి. ఏవైనా పండ్లు తినాలి.

టీ, కాఫీ లాంటివి తీసుకోకపోవడమే ఉత్తమం. సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, తీపి, వేపుడు పదార్థాలను తగ్గిస్తే మంచిది. భోజనం చేసే సమయంలో మాట్లాడకుండా తింటే మంచిది.

భోజనంలో సలాడ్‌ ఉండేలా చూడాలి. ఏ కాలంలో వచ్చే పండ్లను ఆ కాలంలో తీసుకోవాలి.
ప్రతిరోజు ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుదినుసలు ఉండేలా చూసుకోవాలి.

మొలకెత్తిన గింజలు తీసుకుంటూ ఉండాలి. ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్లు శుభ్రంగా తోముకోవాలి. భోజనం సమయాలను తప్పక పాటించాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు. రాత్రి ఎక్కువసేపు మేకోవద్దు.

దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా మరుసటి రోజు ఉదయం నిద్రలేవడం ఆలస్యమవుతుంది. ఆలస్యంగా లేస్తే పనులు కూడా ఆలస్యమవుతాయి.

మానసికంగా ఒత్తిడి పెరిగితే జబ్బులు వచ్చే ప్రమాదముంటుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు ఇష్టమైన సంగీతం వినడం లేదా ఏదైనా మంచి పుస్తకం చదవడం మంచిది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/