తెలంగాణ రాష్ట్రం మీ త్యాగఫలం

harish rao
harish rao

హైదరాబాద్‌: ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ 66వ పుట్టినరోజు. సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ పార్టీ అధినేతపై సోషల్ మీడియా వేదికగా శుభాంక్షాల వర్షం కురిపిస్తున్నారు. సీఎంకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కవిత రూపంలో శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ మీ స్వప్నం
ఈ రాష్ట్రం మీ త్యాగఫలం
ఈ అభివృద్ధి మీ దక్షతకు నిదర్శనం
ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష
తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/