రాష్ట్రం అన్ని రంగాల్లో అధ:పాతాళానికి పోతోంది

తుగ్లక్‌ నిర్ణయాలతో రాష్ట్రానికే కాక దేశానికే నష్టం

buddha venkanna
buddha venkanna

అమరావతి: వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డిపై టిడిపి నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటున్నారు విజయసాయిరెడ్డి అని బుద్ధా వెంకన్న ఆరోపించారు. సీఎం గారి చెత్త ఆలోచనలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అధ:పాతాళానికి పోతున్నా 9 నెలల జగన్‌ పాలనలో రాష్ట్రం వెలిగిపోతుందంటూ బ్లాక్‌ పేపర్‌లో వార్తలు రాయించుకుని సంబరపడుతున్నారని దుయ్యబట్టారు. తుగ్లక్‌ నిర్ణయాలతో రాష్ట్రానికే కాక దేశానికే నష్టం కలిగిస్తుంటే ప్రధాన మంత్రి మందలించక దండ వేసి దన్నం పెడతారా విజయసాయిరెడ్డి గారు? అని ప్రశ్నించారు. 9 నెలల్లో ఏమి సాధించారని మోడీ గారు ప్రశంసలతో ముంచెత్తుతారని బుద్దా వెంకన్న విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/