కేంద్రం నిధులు ఇవ్వకుంటే రాష్ట్రాన్ని నడపలేరు

soyam baburao
soyam baburao

నిర్మల్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఆదిలాబాద్‌ బిజెపి ఎంపీ సోయం బాపురావు తీవ్ర ఆరోపణలు చేశారు. కెసిఆర్‌ ఢిల్లీకి వెళితే బిజెపి పెద్దలు ప్రధాని కాళ్లు మొక్కుతారని, హైదరాబాద్‌ వచ్చిన తర్వతా వారిని తిడతారని సోయం బాపురావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే ఒక్క క్షణం కూడా ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో కెసిఆర్‌ ఉన్నారని ఆరోపించారు. కెసిఆర్‌ ఢిల్లీ వెల్లినప్పుడు అపాయింట్‌మెంట్‌ ఇవ్వోదన్దని ప్రధాని మంత్రి మోడీకి చెప్పానన్నారు. కెసిఆర్‌ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా స్థితిలో ఉందన్నారు. ఆ పరిస్థితుల్లోనూ కేంద్రం ఇచ్చే నిధులను కెసిఆర్‌ దూర్వినియోగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాబోయే మూన్సిపల్‌ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటుతుందని, తెలంగాణలో త్వరలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని సోయం బాపురావు ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/