ప్ర‌జ‌ల‌కు రోశయ్య చేసిన‌ సేవలు మరువలేనివి : ప్రధాని

న్యూఢిల్లీ: రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప‌లువురు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పిస్తూ.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. రోశ‌య్య మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. రోశయ్యతో త‌న‌కు మంచి అనుబంధముంద‌ని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్ర‌జ‌ల‌కు రోశయ్య చేసిన‌ సేవలు మరువలేనివన్నారు. తాను, రోశయ్య ఒకేసారి సీఎంలుగా పనిచేశామని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు గవర్నర్ గా పనిచేసినప్పుడు రోశయ్యతో అనుబంధం ఉందన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/