యాదృచ్ఛికంగా నాకీ అవకాశం దక్కింది

Arjun Tendulkar
Arjun Tendulkar

ముంబయి: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను 30 ఏళ్ల క్రితం ముంబయి రంజీ జట్టుకు ఎంపిక చేసిన వ్యక్తే ఇప్పుడు అతడి కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ను అదే ముంబయి జట్టుకు సెలక్ట్‌ చేశాడు. ఇది యాదృచ్ఛికంగానే జరిగిందని ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రస్తుత చీఫ్‌ సెలెక్టర్‌ మిలింద్‌ రేగి అన్నాడు. సచిన్‌ పాఠశాల స్థాయిలోనే తన బ్యాటింగ్‌తో అనేక రికార్డులు బద్దలుకొట్టి.. 1988 డిసెంబర్‌లో ముంబయి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి ముంబయి చీఫ్‌ సెలెక్టర్‌ నరెన్‌ తమానె లిటిల్‌మాస్టర్‌ ప్రతిభను గుర్తించి రంజీ జట్టులో అవకాశమిచ్చాడు. ఆ సెలక్షన్‌ కమిటీలో ముంబయి రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మిలింద్‌ రేగీ ఒకరు.ఇప్పటివరకూ తండ్రీకొడుకులను ఎంపిక చేసిన సెలక్టర్లు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు. యాదృచ్ఛికంగా తెందూల్కర్‌ విషయంలో నాకీ అవకాశం దక్కింది. అయితే బాగా బౌలింగ్‌ చేసే ఆటగాళ్ల కోసం మేం అన్వేషిస్తుండగా అర్జున్‌ మా కంటపడ్డాడు. ఇటీవల ఇంగ్లాండ్‌ ఎంసీసీ సెకండ్‌ శ్రీI తరఫున ఆడిన అర్జున్‌ 23 వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్‌ను గమనించాను. సెలక్టర్లందరూ అతడిని పర్యవేక్షిస్తున్నారు. అని తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/